Thu Dec 11 2025 14:09:44 GMT+0000 (Coordinated Universal Time)
అఖండ నిర్మాతలకు మరో షాక్
అఖండ నిర్మాతలకు మరో షాక్

అఖండ-2' సినిమా నిర్మాతలకు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈరోజు ప్రీమియర్ షో, టిక్కెట్ల రేట్ల పెంపుపై ప్రభుత్వం జారీచేసిన జీవోను తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈరోజు రాత్రి తొమ్మిది గంటలకు ప్రీమియర్ షో ధర కు తెలంగాణ ప్రభుత్వం టిక్కెట్ ను ఆరు వందల రూపాయలుగా నిర్ణయించారు. ఈ నెల 12వ తేదీ నుంచి 14 తేదీ వరకు మల్టీప్లెక్స్ లు 100 రూపాయలు, సింగిల్ థియేటర్ 50 రూపాయలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారు.
హైకోర్టు సస్పెన్షన్...
దీనిపై హైకోర్టును కొందరు ఆశ్రయించారు. దీనిపై విచారించిన ధర్మాసనం ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్తో పాటు సినీ నిర్మాణ సంస్థకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేస్తూ తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. అఖండ 2 మూవీ రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
Next Story

