Sun Oct 13 2024 13:15:33 GMT+0000 (Coordinated Universal Time)
Devara Movie : "దేవర"కు చంద్రబాబు స్పెషల్ గిఫ్ట్
దేవర సినిమాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదనపు షోలకు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది
దేవర సినిమాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదనపు షోలకు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులను కొద్దిసేపటి క్రితం జారీ చేసింది. ఈ నెల 27వ తేదీన దేవర సినిమా విడుదల అవుతుంది. మొదటి రోజు ఆరు షోలకు అనుమతించిన ప్రభుత్వం తర్వాత తొమ్మిది రోజులకు ఐదు షోలకు అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
సినిమా టిక్కెట్ ధరలను...
దేవర సినిమా టిక్కెట్లను కూడా పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని సినిమా హాళ్లలో దేవర సినిమాకు బాల్కనీ టిక్కెట్ల ధరలు 110 రూపాయలు, దిగువ క్లాస్ టిక్కెట్ అరవై రూపాయల వరకూ పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ కు ఇచ్చిన గిఫ్ట్గా ఆయన అభిమానులు భావిస్తున్నారు. ఈ నెల 27వ తేదీన దేవర విడుదల సందర్భంగా ఏపీలో దాదాపు ఎక్కువ థియేటర్లలో ఈ సినిమా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సిద్ధమయింది.
Next Story