Sun Mar 15 2026 09:54:24 GMT+0530 (India Standard Time)
కల్కి టిక్కెట్ ధరల పెంపుదలకు ఏపీ సర్కార్ అనుమతి
కల్కి సినిమా ధరల పెంపుదలకు ఏపీ ప్రభుత్వం అనుమతించింది. అదనపు షోలు వేయడానికి కూడా ఓకే చెప్పింది

కల్కి సినిమా ధరల పెంపుదలకు ఏపీ ప్రభుత్వం అనుమతించింది. అదనపు షోలు వేయడానికి కూడా ఓకే చెప్పింది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి సినిమా ఈ నెల 27వ తేదీన విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అదనపు షోలు, టిక్కెట్లు ధరలు పెంచుకోవడానికి అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా అదనపు షోలు, టిక్కెట్ల ధరలు పెంచుకునేందుకు అనుమతించింది.
అదనపు షోలు కూడా...
ఈ నెల 27వ తేదీ నుంచి రెండు వారాల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు అనుమతి కోరుతూ నిర్మాత అశ్వనీదత్ చేసిన వినతిని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం కల్కి చిత్రం టిక్కెట్లపై సింగిల్ స్క్రీన్ థియేటర్లలో డెబ్భయి ఐదు రూపాయలు, మల్టీప్లెక్స్ ల్లో 125 రూపాయల వరకు పెంచుకోవచ్చని పేర్కొంది. రోజుకు ఐదు షోలు నిర్వహించేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసింది.
Next Story

