నెటిజెన్లకి అడ్డంగా దొరికిన యాంకర్?
యాంకర్ రష్మీ తనపై నెగెటివ్ కామెంట్స్ చేసే నెటిజెన్స్ ని ఆడుకుంటుంది. వారికి తగిన సమాధానం చెబుతూ మరోసారి తన జోలికి రాకుండా చెయ్యగల సత్తా ఉన్న [more]
యాంకర్ రష్మీ తనపై నెగెటివ్ కామెంట్స్ చేసే నెటిజెన్స్ ని ఆడుకుంటుంది. వారికి తగిన సమాధానం చెబుతూ మరోసారి తన జోలికి రాకుండా చెయ్యగల సత్తా ఉన్న [more]
యాంకర్ రష్మీ తనపై నెగెటివ్ కామెంట్స్ చేసే నెటిజెన్స్ ని ఆడుకుంటుంది. వారికి తగిన సమాధానం చెబుతూ మరోసారి తన జోలికి రాకుండా చెయ్యగల సత్తా ఉన్న యాంకర్. 30 ఏళ్ళు దాటినా పెళ్లి చేసుకోకుండా ఉన్న రష్మీ ని సుధీర్ తో లింకప్ చేసి పాపులర్ చేసారు. రష్మీ సుధీర్ జోడి మీద కామెడీ కామెంట్స్ బాగా పేలుతాయి. జబర్దస్త్, ఢీ షోస్ లో యాంకర్ రష్మీ చాల యాక్టీవ్. అనసూయ తర్వాత అంతటి పాపులారిటీ ఉన్న యాంకర్ రష్మినే. అయితే ఎప్పుడూ నెటిజెన్స్ కి తగిన సమాధానం చెప్పే రష్మీ ఈసారి మాత్రం నెటిజెన్స్ చేతికి అడ్డంగా దొరికిపోయింది. కారణం కరోనా వైరస్. కరోనా వైరస్ కి భయపడి సినిమా షూటింగ్ దగ్గరనుండి, టివి సీరియల్స్ షూటింగ్స్ వరకు అంతా బంద్ చేస్తుంటే… రష్మీ మాత్రం..
రాజమండ్రిలోని ఓ షాప్ ఓపెనింగ్ కి వెళుతునట్టుగా ట్వీట్ చెయ్యామే కాదు… ఓపెనింగ్ సమయానికి రష్మిని చూడడానికి ప్రజలు ఎగబడ్డారు. అప్పుడు పోలీస్ లు ప్రజల్ని కంట్రోల్ చేసి భారీగా గుమికూడినజనసందోహాన్ని అక్కడినుండి పంపేశారు. అయితే రష్మీ ఆ షాప్ ఓపినింగ్ కి వస్తున్నట్టుగా ముందస్తుగా ట్వీట్ చెయ్యడం వలనే ప్రజలు కరోనా భయం లేకుండా అధిక సంఖ్యలో వచ్చారని… అందరూ అన్ని ఆపుకుని కూర్చుంటే నువ్వు మాత్రం షోరూం ఓపెనింగ్ కి ఎలా వచ్చావ్ అంటూ నెటిజెన్స్ పెద్ద సంఖ్యలో రష్మిని ఆడుకున్నారు. ఇక రష్మీ షోరూం ఓపెనింగ్ అయ్యాక నిజాయితీగా క్షమాపణలు చెప్పింది. కరొనతో కొందరు భయపడడం లేదని.. అయినా ఇన్ని జాగ్రత్తలు అవసరమా అని, కొంతమంది బయట ఫుడ్ ఇష్టానుసారంగా తింటున్నారని.. వారు మారాలని… తాను ట్వీట్ చేసి ఇలా చెయ్యడం మంచిపని కాదని అందుకే సారి అంటూ చెప్పుకొచ్చింది.