Sat Mar 07 2026 23:58:48 GMT+0530 (India Standard Time)
యాంకర్, నటి అనసూయ ఇంట తీవ్ర విషాదం
యాంకర్ అనసూయ భరద్వాజ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి సుదర్శన్ రావు తీవ్ర అనారోగ్యంతో ఆదివారం ఉదయం మరణించారు.

జబర్దస్త్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు యాంకర్ గా పరిచయమైన అనసూయ భరద్వాజ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి సుదర్శన్ రావు తీవ్ర అనారోగ్యంతో ఆదివారం ఉదయం మరణించారు. సుదర్శన్ రావు (63) కొంతకాలంగా క్యాన్సర్ తో పోరాడుతున్నారు. దానిని తగ్గించుకునేందుకు మందులు కూడా వాడుతున్నారు. కానీ.. ఇటీవల ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన.. తుదిశ్వాస విడిచారు. దీంతో అనసూయ సహా ఆమె కుటుంబ సభ్యులు, సన్నిహితులు శోకసంద్రంలో మునిగిపోయారు.
పెళ్లికి ఒప్పించడానికి...
సుదర్శన్ రావు గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించారు. సోషల్ యాక్టివిటీస్ లో కూడా చురుగ్గా పాల్గొనేవారు. అనసూయ తండ్రి స్వర్గస్తులైన విషయం తెలియగానే జబర్దస్త్ ఆర్టిస్టులు ఆమె ఇంటికెళ్లి పరామర్శిస్తున్నారు. కాగా.. గతంలో యాంకర్ అనసూయ తన తండ్రి గురించి మాట్లాడుతూ.. ఆయన చాలా స్ట్రిక్ట్ పర్సన్ అని, తన ప్రేమ పెళ్లికి కూడా ఆయన అంత త్వరగా ఒప్పుకోలేదని చెప్పింది. తమ పెళ్లికిి తన తండ్రిని ఒప్పించేందుకు 9 సంవత్సరాల సుదీర్ఘ సమయం పట్టిందని పేర్కొంది.
Next Story

