లాక్ డౌన్ లో అనసూయ ముచ్చట్లు!!
నిన్నగాక మొన్న అనసూయ ప్రేమ పెళ్లి వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. అనసూయ – భరద్వాజ్ లు 9 ఏళ్ళు ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో [more]
నిన్నగాక మొన్న అనసూయ ప్రేమ పెళ్లి వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. అనసూయ – భరద్వాజ్ లు 9 ఏళ్ళు ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో [more]
నిన్నగాక మొన్న అనసూయ ప్రేమ పెళ్లి వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. అనసూయ – భరద్వాజ్ లు 9 ఏళ్ళు ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో పెళ్లాడిన ముచ్చట్లు ముగియక ముందే అనసూయ మరోసారి అభిమానులతో చిట్ చాట్ లోకొచ్చింది. బుల్లితెర మీద క్రేజీ హాట్ యాంకర్ గా దూసుకుపోతున్న అనసూయ వెండితెర మీద కూడా అద్భుతంగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం రంగమార్తాండ సినిమాలో అనసూయ ఓ కీలక పాత్ర చేస్తుంది.
అయితే తాజాగా సోషల్ మీడియా లో లైవ్ చాట్ లో మాట్లాడిన అనసూయ అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. అందులో భాగంగా అనసూయ మీ ఫస్ట్ పారితోషకాన్ని ఏం చేసారు అని అడగగా.. నా తోలి పారితోషకంతో మా అమ్మకు బంగారు ఉంగరం కొని ఇచ్చాను. అదే నాకు తృప్తి ఇచ్చిన సందర్భం అని చెప్పింది. మీరు ఏదైనా సినిమాలో ఛాలెంజింగ్ రోల్ చేసారా అని అడగగా.. నేను ఇప్పటివరకు ఛాలంజ్ అనుకున్న పాత్ర ఏది చెయ్యలేదు. ఎందుకంటే.. నాకు ఇప్పటివరకు ఛాలంజ్ ఉన్న పాత్ర దొరకలేదు. ఇక తాను మూడు సినిమాల్లో నటిస్తున్నా అని చెప్పిన అనసూయ కరోనా లాక్ డౌన్ కారణంగా ఆ సినిమా షూటింగ్స్ వాయిదా పడినట్లుగా చెబుతుంది.
- Tags
- anasuya