‘దొరసాని’ ట్రైలర్ ఆకట్టుకుంటుంది
విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన మొదటి సినిమా ట్రైలర్ ఈరోజు రిలీజ్ చేసారు. దొరసాని పేరుతో తెరకెక్కిన ఈసినిమాలో రాజశేఖర్ కూతురు అయినా శివాత్మిక [more]
విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన మొదటి సినిమా ట్రైలర్ ఈరోజు రిలీజ్ చేసారు. దొరసాని పేరుతో తెరకెక్కిన ఈసినిమాలో రాజశేఖర్ కూతురు అయినా శివాత్మిక [more]

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన మొదటి సినిమా ట్రైలర్ ఈరోజు రిలీజ్ చేసారు. దొరసాని పేరుతో తెరకెక్కిన ఈసినిమాలో రాజశేఖర్ కూతురు అయినా శివాత్మిక కూడా ఈసినిమాతో సినీ ఇండస్ట్రీ కి పరిచయం అవుతుంది. మధుర ఎంటర్ టైన్మెంట్, బిగ్ బెన్ సినిమాలు సంయుక్తంగా ఈచిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.
ఇక ఈరోజు రిలీజ్ అయినా ట్రైలర్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా డైలాగ్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. ‘రేపే నీ విడుదల కదా…’ అన్న డైలాగ్ తో మొదలైన ట్రైలర్ ప్రధానంగా ఒక స్వచ్ఛమైన ప్రేమ కథను హైలెట్ చేస్తూ ఎమోషనల్ గా సాగింది. ప్రశాంత్ ఆర్ విహారి అందించిన నేపధ్య సంగీతం ట్రైలర్ ను మరో స్థాయిలో నిలబెట్టాయి. చిన్న దొరసాని తన లుక్స్ తో ఆకట్టుకుంటే ఆనంద్ దేవరకొండ తన పాత్రకు తగ్గట్టుగా చాలా సహజంగా నటించాడు.
ఈ ట్రైలర్ జులై 12న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఈ మూవీ పై బాగానే అంచనాలు పెంచింది. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఈచిత్రం రూపొందింది.

