Sun Dec 08 2024 01:00:40 GMT+0000 (Coordinated Universal Time)
ఓటీటీలోకి అమిగోస్.. స్ట్రీమింగ్ అప్పటి నుంచే..
ఈ సినిమాతో రాజేంద్రరెడ్డి అనే దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. కథ విషయానికొస్తే.. ప్రపంచంలో ఒకరిని..
కల్యాణ్ రామ్ హీరోగా.. త్రిపాత్రాభినయంలో రూపొందిన సినిమా అమిగోస్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 10వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాతో రాజేంద్రరెడ్డి అనే దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. కథ విషయానికొస్తే.. ప్రపంచంలో ఒకరిని పోలిన వారు ఒకరు ఏడుగురు ఉంటారన్న కాన్సెప్ట్ తో నడుస్తుంది. ఈ సినిమాతో తెలుగు తెరకి ఆషిక రంగనాథ్ పరిచయమైంది. గ్లామర్ పరంగా ఆమెకి మంచి మార్కులు పడ్డాయి.
సినిమా మంచి లైన్ తోనే రూపొందింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. పాటలు కూడా ఆకట్టుకున్నాయి. కానీ.. టైటిలే సినిమాకి కాస్త మైనస్ అయిందన్న టాక్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ డేట్ ను అనౌన్స్ చేసింది నెట్ ఫ్లిక్స్. అమిగోస్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న నెట్ ఫ్లిక్స్.. ఏప్రిల్ 1వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్టు ప్రకటించింది. ఓటీటీలో అమిగోస్ కు విశేష ఆదరణ లభిస్తుందని తెలుస్తోంది.
Next Story