Fri Dec 05 2025 19:53:34 GMT+0000 (Coordinated Universal Time)
బన్నీతో ఫొటో అంటూ మెసేజ్ లు.. అభిమానుల తోపులాట
అల్లు అర్జున్ తో సెల్ఫీలంటూ అభిమానులకు మెసేజ్ లు అందడంతో పెద్దయెత్తున తోపులాట జరిగింది. పలువురికి గాయాలయ్యాయి

అల్లు అర్జున్ తో సెల్ఫీలంటూ అభిమానులకు మెసేజ్ లు అందడంతో పెద్దయెత్తున తోపులాట జరిగింది. పలువురికి గాయాలయ్యాయి. హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో ఈ ఘటన జరిగింది. అల్లు అర్జున్ తో ఫొటోలు దిగాలనుకునేవారు ఎన్ కన్వెన్షన్ సెంటర్ కు రావాలంటూ అల్లు అభిమానులకు మెసేజ్ లు వెళ్లాయి. మెసేజ్ లు చూసిన అభిమానులు వేలాది మంది ఎన్ కన్వెన్షన్ సెంటర్ కు చేరుకున్నారు.
లాఠీ చార్జి....
అయితే కార్యక్రమం రద్దయిందని నిర్వాహకులు ప్రకటించడంతో అల్లు అర్జున్ అభిమానులు గేట్లు తోసుకుని లోపలికి వెళ్లారు. దీంతో పోలీసులు లాఠీ ఛార్జి చేశారు. లాఠీ ఛార్జిలో పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు సీరియస్ అయ్యారు. నిర్వాహకులపై కేసు నమోదు చేయనున్నారు.
- Tags
- allu arjun
- fans
Next Story

