అల్లు అర్జున్ వాయిస్ ఓవర్ మాత్రమే..!
రామ్ చరణ్ నిర్మాతగా చిరంజీవి నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం షూటింగ్ ప్రస్తుతం తుది దశలో ఉంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా చిరంజీవి ప్రధాన పాత్రలో [more]
రామ్ చరణ్ నిర్మాతగా చిరంజీవి నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం షూటింగ్ ప్రస్తుతం తుది దశలో ఉంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా చిరంజీవి ప్రధాన పాత్రలో [more]
![allu arjun gap with producers allu arjun gap with producers](https://www.telugupost.com/h-upload/old_images/1187442-allu-arjunduvvadajagannatham.webp)
రామ్ చరణ్ నిర్మాతగా చిరంజీవి నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం షూటింగ్ ప్రస్తుతం తుది దశలో ఉంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో సుదీప్, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, జగపతిబాబు వంటి స్టార్ లు నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే గత కొన్ని రోజులు నుండి ఈ సినిమాలో అల్లు అర్జున్ ఓ కీలక పాత్రలో నటించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.
అల్లు అర్జున్ వాయిస్ ఓవర్ తో ప్రారంభం
అయితే మెగా కాంపౌండ్ నుండి దీనిపై క్లారిటీ వచ్చింది. ఇందులో బన్నీ ఎలాంటి కీలక పాత్రలో నటించట్లేదంట. కాకపోతే సినిమాలోని కొన్ని కీలక ఘట్టాలు బన్నీ వాయిస్ ఓవర్ తోనే మొదలవుతాయట. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఆగస్టు నెలలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.