హీరో పక్కన చేరిన దర్శకుడు
టాలీవుడ్ లోనే కాదు… ఏ భాషలోనైనా స్టార్ హీరోలతో సమానమైన క్రేజ్ ని దర్శకులు సొంతం చేసుకుంటున్నారు. తెలుగులో అయితే స్టార్ హీరోలంత క్రేజ్ రాజమౌళి లాంటోళ్ళకి [more]
టాలీవుడ్ లోనే కాదు… ఏ భాషలోనైనా స్టార్ హీరోలతో సమానమైన క్రేజ్ ని దర్శకులు సొంతం చేసుకుంటున్నారు. తెలుగులో అయితే స్టార్ హీరోలంత క్రేజ్ రాజమౌళి లాంటోళ్ళకి [more]

టాలీవుడ్ లోనే కాదు… ఏ భాషలోనైనా స్టార్ హీరోలతో సమానమైన క్రేజ్ ని దర్శకులు సొంతం చేసుకుంటున్నారు. తెలుగులో అయితే స్టార్ హీరోలంత క్రేజ్ రాజమౌళి లాంటోళ్ళకి ఉంది. మిగతా దర్శకులకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందులో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అంటే స్పెషల్ కేటగిరి, ప్రేక్షకులకు పిచ్చ అభిమానం. ఆయన కామెడీ పంచ్ లకి విశేషమైన అభిమానులున్నారు. అయితే ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ తో అల వైకుంఠపురములో సినిమా చేసిన త్రివిక్రమ్ కి అజ్ఞాతవాసి డిజాస్టర్ ఎఫెక్ట్ కానీ, అరవింద సమేత మాస్ ఎఫెక్ట్ కానీ ఆయన మీద పడలేదు.అందుకే త్రివిక్రమ్ క్రేజ్, అల్లు అర్జున్ స్టయిల్ అన్నిటికలిపి అల వైకుంఠపురములో సినిమాపై భీభత్సమైన క్రేజ్ ఉంది. ఆ సినిమా టీజర్ కానీ, సాంగ్స్ కానీ అన్ని ఆకట్టుకునేలా ఉండడంతో త్రివిక్రమ్ మేకింగ్ స్టయిల్ మీద మరింత క్రేజ్ ఏర్పడింది.

ఇక జనవరి 12 న విడుదల కాబోతున్న అల వైకుంఠపురములో ప్రమోషన్ ఓ రేంజ్ లో ఎప్పుడో మొదలైంది. రేపు 6 న యూసుఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో అల వైకుంఠపురములో మ్యూజిక్ ఫెస్టివల్ భారీ స్థాయిలో చేస్తున్నారు. ఇక థియేటర్స్ దగ్గర హీరో కట్ఔట్స్ పోస్టర్స్ ఇలా ఫ్యాన్స్ హంగామా మాములుగా లేదు. అయితే ఈసారి అల్లు అర్జు క్రేజ్ కి త్రివిక్రమ్ కూడా తోడవడం ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ తో అల్లు అర్జున్ కటౌట్స్ పక్కనే త్రివిక్రమ్ కటౌట్స్ పెట్టడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. చిత్రానికి సంబంధించిన కట్ఔట్స్ అప్పుడే తెలుగు రాష్ట్రాలలో ఎక్కడబడితే అక్కడ దర్శనమిస్తున్నాయి. మరి ఆశ్చర్యకరంగా అల్లు అర్జున్ భారీ కట్ఔట్ పక్కనే త్రివిక్రమ్ కట్ఔట్ కనిపించడం ఆసక్తి రేపుతోంది… మరి ఇదంతా చూసిన త్రివిక్రమ్ ఫ్యాన్స్ ఫిదా ఐపోతున్నారు.

