చెర్రీ ప్లేస్ లోకి బన్నీ?
ప్రస్తుతం రామ్ చరణ్ #RRR సినిమాకి లాకైపోయి ఉన్నాడు. #RRR సినిమా ఈ ఏడాది అనుకుంటే అది కాస్త వచ్చే ఏడాదికి మారడంతో చరణ్ ప్రస్తుతం వేరే [more]
ప్రస్తుతం రామ్ చరణ్ #RRR సినిమాకి లాకైపోయి ఉన్నాడు. #RRR సినిమా ఈ ఏడాది అనుకుంటే అది కాస్త వచ్చే ఏడాదికి మారడంతో చరణ్ ప్రస్తుతం వేరే [more]

ప్రస్తుతం రామ్ చరణ్ #RRR సినిమాకి లాకైపోయి ఉన్నాడు. #RRR సినిమా ఈ ఏడాది అనుకుంటే అది కాస్త వచ్చే ఏడాదికి మారడంతో చరణ్ ప్రస్తుతం వేరే ప్రాజెక్ట్స్ కి కమిట్మెంట్స్ ఇచ్చేలా లేడు. అయితే #RRR షూటింగ్ మే కల్లా కంప్లీట్ అవుతుంది అన్న ఉద్దేశ్యంతో రామ్ చరణ్ తన తండ్రి చిరు, కొరటాలతో కలిసి చేస్తున్న సినిమా కోసం కమిట్ అయ్యాడు. అందులో యంగ్ చిరు గా చరణ్ ఓ 20 నిమిషాల పాత్ర కోసం ఒప్పుకున్నాడు. చరణ్ యంగ్ చిరు గా నక్సలైట్ గా కనిపిస్తాడని, చరణ్ కి జోడిగా సమంత హీరోయిన్ గ నటిస్తుంది అని అంటున్నారు. చిరు – కొరటాల సినిమాలో చరణ్ ఫిక్స్ అనే వార్తలు సోషల్ మీడియా ని కమ్మేశాయి.
తాజాగా #RRR కోసం చరణ్ తండ్రి సినిమాని వదులుకోవాల్సి వస్తుంది అని… చరణ్ కోసం కొరటాల మరో ఏడాది సినిమాని ఆపలేడు గనక చరణ్ ప్లేస్ లో మరో హీరో ని అనుకుంటున్నట్టుగా తెలుస్తుంది. రాజమౌళి షరతుల ప్రకారం తన సినిమా విడుదల కాకుండా తన హీరో మరో సినిమాకి కమిట్ అవడం కానీ, తన సినిమా కన్నా ముందే ఆ హీరో సినిమా రిలీజ్ అవడం కానీ జరగకూడదు కాబట్టి.. చరణ్ చిరు సినిమా నుండి తప్పుకున్నాడని న్యూస్ వినబడుతుంది. అయితే చెర్రీ ప్లేస్ లోని అల్లు అర్జున్ ని తీసుకుంటే బావుంటుంది అని కొరటాల భావిస్తున్నాడట. చిరు యంగ్ పాత్రను చేయడానికి అల్లు అర్జున్ కూడా ఉత్సాహాన్ని చూపుతున్నాడని కాబట్టి చెర్రీ ప్లేస్ ని బన్నీ భర్తీ చేసినట్టే అంటున్నారు.

