సుకుమార్ సినిమాలో బన్నీ, రష్మిక లు ఎలా ఉంటారంటే.
సుకుమార్ సినిమాలో హీరోలకి స్పెషల్ లుక్స్ ఉంటాయి. హీరోలను ప్రత్యేకంగా చూపించడం లో సుకుమార్ కి ఓ స్టయిల్ ఉంటుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ తో ఎర్రచందనం [more]
సుకుమార్ సినిమాలో హీరోలకి స్పెషల్ లుక్స్ ఉంటాయి. హీరోలను ప్రత్యేకంగా చూపించడం లో సుకుమార్ కి ఓ స్టయిల్ ఉంటుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ తో ఎర్రచందనం [more]

సుకుమార్ సినిమాలో హీరోలకి స్పెషల్ లుక్స్ ఉంటాయి. హీరోలను ప్రత్యేకంగా చూపించడం లో సుకుమార్ కి ఓ స్టయిల్ ఉంటుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ తో ఎర్రచందనం నేపథ్యంలో సినిమా మొదలు పెట్టాడు సుకుమార్. వీరి కాంబోలో తెరకెక్కిన ఆర్య, ఆర్య 2 సినిమాలు సక్సెస్ అవడంతో.. ఇప్పుడు రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అందులోను సుకుమార్ రంగస్థలం లాంటి బెంచ్ మార్క్ మూవీ ని సెట్ చెయ్యడంతో.. తన తదుపరి చిత్రంపై క్రేజ్ నెలకొంది. అయితే ఈ సినిమాలో బన్నీ, రష్మిక మందన్న ల లుక్స్ మీద ఇండస్ట్రీలో ఓ హాట్ టాపిక్ మొదలైంది.
అది ఈ సినిమాలో అల్లు అర్జున్ మాస్ లుక్ లో గెడ్డం అవి పెంచి స్మగ్లర్ గా రా అండ్ రఫ్ లుక్ లో కనిపిస్తాడని, ఇక రష్మిక అయితే ఫారెస్ట్ అధికారిగా స్మగ్లర్లస్ ని పట్టుకోవడానికి ఎవరికీ తెలియని ఎర్రచందనం స్మగ్లింగ్ కూలీగా కనిపించబోతుందట. రష్మిక ఈ కూలి పాత్రలో డి గ్లామరస్ గా కనిపించడమే కాకుండా.. రంగస్థలం లో అనసూయ, సమంత ల మిక్స్డ్ లుక్ లో రష్మిక ను సుకుమార్ ఈ సినిమాలో చూపించబోతున్నాడట. మరో పక్క సుకుమార్ కి నల్లమల, శేషాచలం అడవుల్లో సినిమా షూటింగ్ చెయ్యడనికి అధికారులు అడ్డు చెప్పడంతో(పులులు, సింహాల సంచారం వలన) సుకుమార్ తన టీం తో థాయిలాండ్ వెళ్ళబోతున్నాడని అంటున్నారు

