Sun Mar 22 2026 11:34:56 GMT+0530 (India Standard Time)
వర్మ ఓ నికృష్టుడు...నీచుడు

రాంగోపాల్ వర్మ ఒక నికృష్టుడని గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ మండిపడ్డారు. మీడియా సమావేశంలో ఆయన రాంగోపాల్ వర్మపై నిప్పులు చెరిగారు. శ్రీరెడ్డితో పవన్ కల్యాణ్ ను తిట్టించింది తానేనని రాంగోపాల్ వర్మ ప్రకటించుకోవడం సిగ్గుచేటన్నారు. ఇంత నికృష్టపు పనులు చేసే రాంగోపాల్ వర్మను ఎవరూ క్షమించరన్నారు అల్లు అరవింద్. తెలుగు పరిశ్రమ నుంచే ఎదిగిన వర్మ తల్లి లాంటి పరిశ్రమకు ద్రోహం చేస్తున్నారన్నారు. తాను రాత్రి ఒక వీడియో చూశానని, ఆ వీడియో చూసిన తర్వాత వర్మ ఎంత నీచుడో అర్థమయిందన్నారు. ఈ కుట్ర వెనక ఎవరు ఉన్నారో తేలాలన్నారు. ఇలా వర్మను అల్లుఅరవింద్ తిట్టిపోశారు.
Next Story

