అల్లు అర్జున్ లాభపడతాడా?
త్రివిక్రమ్ కెరీర్ లో పవన్ కళ్యాణ్ తో తీసిన అజ్ఞాతవాసి సినిమా అతి పేద డిజాస్టర్. ఆ సినిమాకి త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ ని చూసి భారీ [more]
త్రివిక్రమ్ కెరీర్ లో పవన్ కళ్యాణ్ తో తీసిన అజ్ఞాతవాసి సినిమా అతి పేద డిజాస్టర్. ఆ సినిమాకి త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ ని చూసి భారీ [more]

త్రివిక్రమ్ కెరీర్ లో పవన్ కళ్యాణ్ తో తీసిన అజ్ఞాతవాసి సినిమా అతి పేద డిజాస్టర్. ఆ సినిమాకి త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ ని చూసి భారీ బడ్జెట్ పెట్టించేవాడు. కానీ ఆ సినిమా అనుకున్న ఫలితం రాకపోగా… నిర్మాతలకు భారీ షాకిచ్చింది. ఆ దెబ్బకి త్రివిక్రమ్ ఎన్టీఆర్ చెప్పింది చేసాడు. తనకు నచ్చని జోనర్ లో ఎన్టీఆర్ చెప్పినట్లుగా అరవింద సమేత మాస్ చిత్రం తీసాడు. ఎన్టీఆర్ చెప్పాడని కాదుగాని… త్రివిక్రమ్ కూడా అజ్ఞాతవాసి దెబ్బకి అరవింద సమెతకి బడ్జెట్ కంట్రోల్ లో పెట్టాడు. ఇక అరవింద సమేత సినిమాకి హిట్ టాక్ వచ్చినా కలెక్షన్స్ రాలేదు. అయినప్పటికీ నిర్మాతలకు నష్టాలైతే రాలేదు. కారణం బడ్జెట్ కంట్రోల్.
అయితే అజ్ఞాతవాసి దెబ్బకి అరవింద సమేత తో లైన్ లోకొచ్చిన త్రివిక్రమ్ అల వైకుంఠపురములో సినిమా కి మాత్రం బడ్జెట్ కంట్రోల్ తప్పాడని ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా కి స్టార్ నటులను తీసుకోవడం, అలాగే త్రివిక్రమ్ సినిమా కోసం అందమైన భారీ సెట్స్ వేయించాడని అందుకే బడ్జెట్ కంట్రోల్ లో లేకుండా ఎడా పెడా ఖర్చు అవుతుందని అంటున్నారు. ఇంకా ఎవరూ టచ్ చెయ్యని ఫారిన్ లొకేషన్స్ లో షూట్ చేయడం వలన కూడా బడ్జెట్ పెరిగిందనే టాక్ వినబడుతుంది. ఇప్పటివరకు అల్లు అర్జున్ సినిమాలకు పెట్టని పెట్టుబడి ఈ చిత్రానికి అవుతుందని అంటున్నారు. మరి త్రివిక్రమ్ వలన అల్లు అర్జున్ కెరీర్ లో ఈ అల వైకుంఠపురములో సినిమా భారీ బడ్జెట్ చిత్రం కాబోతుందన్నమాట

