Sun Dec 08 2024 02:26:16 GMT+0000 (Coordinated Universal Time)
Akshay Kumar: రీమేక్ చేస్తాడని విమర్శిస్తున్నారే.. నిర్మాతలు మోసం చేశారట!
బాలీవుడ్ లో స్టార్ హీరోలలో అక్షయ్ కుమార్ ఒకడు
బాలీవుడ్ లో స్టార్ హీరోలలో అక్షయ్ కుమార్ ఒకడు. ఒకప్పుడు మినిమమ్ గ్యారెంటీ హీరోగా అక్షయ్ కుమార్ పేరు తెచ్చుకున్నాడు. అయితే ఇటీవలి కాలంలో వరుస ఫ్లాప్ లతో సతమతమవుతూ ఉన్నాడు. ముఖ్యంగా సౌత్ కు సంబంధించిన చాలా సినిమాలను రీమేక్ చేస్తున్నాడంటూ ఓ వర్గం అక్షయ్ ను టార్గెట్ చేసింది కూడా. అందుకే అక్షయ్ కుమార్ మంచి సినిమాలను రీమేక్ చేసినా.. రివ్యూలు పాజిటివ్ గా వచ్చినా కూడా సినిమాను హిట్ మాత్రం అవ్వడం లేదు.
అక్షయ్ కుమార్ తాజా చిత్రం సర్ఫిరా జూలై 12న విడుదలైంది. రాధికా మదన్, పరేష్ రావల్ కూడా ఈ సినిమాలో నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నప్పుడు అక్షయ్ కుమార్ ను.. మిమ్మల్ని ఎవరైనా మోసం చేశారా? అనే ప్రశ్న ఎదురైంది. అయితే అక్షయ్ కుమార్ తాను ఎలా మోసపోయాడో వివరించాడు. కొందరు నిర్మాతల మాటలు నమ్మి తాను కూడా మోసపోయానని.. కొందరు నిర్మాతలు మంచి స్థాయిలో ఉన్నా కూడా తన డబ్బులు తనకు ఇవ్వలేదని అక్షయ్ కుమార్ తెలిపాడు. నిర్మాతలు డబ్బులు ఇవ్వకుండా మోసం చేసినా కూడా తాను వాళ్ళను ఏమీ అనలేదని చెప్పుకొచ్చాడు అక్కీ.
సింగం అగైన్ సినిమాతో త్వరలోనే పలకరించనున్నాడు అక్షయ్ కుమార్. భారీ బడ్జెట్ సినిమాకు రోహిత్ శెట్టి దర్శకత్వం వహించాడు. ఈ సంవత్సరం నవంబర్‌లో భారీ తారాగణంతో ఈ సినిమా విడుదల కాబోతోంది. దీపికా పదుకొణె, కరీనా కపూర్, టైగర్ ష్రాఫ్, అర్జున్ కపూర్‌తో పాటు అజయ్ దేవగన్, రణ్వీర్ సింగ్, అక్షయ్ కుమార్ ఈ యాక్షన్ ఫిల్మ్‌లో కనిపించనున్నారు. సునీల్ శెట్టి, నిమ్రత్ కౌర్, సారా అలీ ఖాన్‌లతో పాటు అక్షయ్ స్కై ఫోర్స్ అనే సినిమాలో కూడా కనిపించనున్నాడు. తాప్సీ పన్ను, ఫర్దీన్ ఖాన్, వాణి కపూర్, అమ్మీ విర్క్‌లతో కలిసి నటించిన అతని చిత్రం 'ఖేల్ ఖేల్ మే' ఆగస్టులో విడుదల కానుంది.
Next Story