ఏఎన్నార్ షేడ్స్ తో వస్తున్న అఖిల్..!
అమ్మాయిలు ఆ అబ్బాయిని చూస్తే మైమరిచిపోతారు. అతని కోసం పడిచచ్చిపోతుంటారు. అతనితో మాట్లాడుతుంటే ఏదో హాయి స్వరం వినిపిస్తునట్లు ఉంటుంది వాళ్లకి. ప్రస్తుతం ఇటువంటి పాత్రే ఒకటి చేయపోతున్నాడు అక్కినేని అఖిల్. వెంకీ అట్లూరి డైరెక్షన్ అఖిల్ లవర్ బాయ్ గా కనిపించబోతున్నాడని ఫిలింనగర్ సమాచారం.వెంకీ అట్లూరి 'తొలిప్రేమ' సినిమాతో అందరినీ ఫిదా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే విధంగా మరోసారి ఈ సినిమాతో ఫిదా చేయనున్నాడు. అఖిల్ కి జోడిగా నిధీ అగర్వాల్ నటిస్తుంది. అక్కినేని నాగార్జున, నాగేశ్వరరావు ఇటువంటి పాత్రలు చాలానే చేశారు. కానీ అఖిల్ కు మాత్రమే ఇదే మొదటిసారి. వరసగా రెండు సినిమాలు అనుకున్న స్థాయిలో ఆడకపోవడంతో ఈసారి కచ్చితంగా హిట్ కొట్టాలనే ధీమాతో వర్క్ చేస్తున్నాడు అఖిల్.
మిస్టర్ మజ్ను..?
1971లో అక్కినేని నాగేశ్వరరావు ‘ప్రేమ్‌నగర్’లో చేసిన క్యారెక్టర్‌లోని కొన్ని షేడ్స్ అఖిల్ పాత్రలో కనిపిస్తాయని సమాచారం. అందులో నాగేశ్వరరావు పాత్రలో ఉండే లవ్ యాంగిల్‌ని మాత్రమే తీసుకున్నారట బీవీయస్ఎన్ ప్రసాద్. ఈ సినిమా మేజర్ షెడ్యూల్ రీసెంట్గా లండన్‌లో పూర్తయింది. లేటెస్ట్ షెడ్యూల్‌ను హైదారాబాద్‌లో ప్లాన్ చేసింది చిత్రబృందం. పాత్రకు తగట్టు ఈ సినిమా టైటిల్ ‘మిస్టర్ మజ్ను’ అని పెడుతున్నట్టు సమాచారం.