Sat Dec 14 2024 16:54:15 GMT+0000 (Coordinated Universal Time)
అక్కినేని అఖిల్ కాబోయే భార్య ఎవరంటే?
అక్కినేని అఖిల్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. . అఖిల్ అక్కినేనితో జైనబ్ రవ్జీతో వివాహం కుదిరింది
అక్కినేని నాగార్జున ఇంట్లో పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. అక్కినేని అఖిల్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పటికే నాగచైతన్య వివాహం ఖరారయిన నేపథ్యంలో అఖిల్ నిశ్చితార్థం కూడా అయిందని నాగార్జున ఎక్స్ లో పోస్టు చేశారు. అఖిల్ అక్కినేనితో జైనబ్ రవ్జీతో వివాహం కుదిరిందని తెలిపారు. జైనబ్ తన ఇంటి కోడలు కాబోతున్నట్లు నాగార్జున అఫీషియల్ గా ప్రకటించారు.
జైనబ్ ఎవరంటే...
నాగార్జున ఎక్స్ లో చేసిన ట్వీట్ ప్రకారం జైనబ్ తో అక్కినేని అఖిల్ నిశ్చితార్ధం జరిగింది. కోడలిగా జైనబ్ ను తమ కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నందుకు సంతోషంగా ఉందన్న నాగార్జున కాబోయే నూతన దంపతులకు ఆశీస్సులంటూ ఆయన పేర్కొన్నారు. అఖిల్ నిశ్చితార్థం అతి కొద్ది మంది అతిధులతో రెండు కుటుంబాల సమక్షంలో జరిగిందని చెప్పారు. పెళ్లి ముహూర్తం మాత్రం ఇంకా ఖరారు కాలేదు. అయితే ఢిల్లీకి చెందని జైనబ్ థియేటర్ ఆర్టిస్ట్ మాత్రమే కాకుండా సోషల్ మీడియా ఇన్ ఫ్యూయెన్సెర్ కూడా. రెండేళ్ల క్రితం పరిచయమై అది కాస్తా ప్రేమగా మారడంతో వివాహం నిశ్చయించారు.
Next Story