Sun Dec 08 2024 05:49:15 GMT+0000 (Coordinated Universal Time)
ఓటీటీలో వాలిమై.. ఎప్పుడు ? ఎందులో ?
తెలుగులోనూ వాలిమై సినిమా విడుదలైంది కానీ.. అదే సమయంలో భీమ్లా నాయక్ కూడా విడుదల కావడంతో ఎవరూ పట్టించుకోలేదు. తెలుగులో..
హైదరాబాద్ : తమిళస్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన వాలిమై సినిమా ఫిబ్రవరి 24న విడుదలై.. తమిళనాట భారీ వసూళ్లు రాబట్టింది. కేవలం రెండ్రోజుల్లోనే ఈ సినిమా రూ.100 కోట్ల వసూళ్లు సాధించి, రికార్డు సృష్టించింది. తెలుగులోనూ వాలిమై సినిమా విడుదలైంది కానీ.. అదే సమయంలో భీమ్లా నాయక్ కూడా విడుదల కావడంతో ఎవరూ పట్టించుకోలేదు. తెలుగులో రూ.2.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన వాలిమై.. ఆఖరికి రూ.2.26 కోట్ల కలెక్షన్లు సాధించింది.
త్వరలోనే వాలిమై సినిమా ఓటీటీలో విడుదల కానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 వాలిమై డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. మార్చి 25 నుంచి వాలిమైను స్ట్రీమ్ చేయనున్నట్లు జీ5 సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ సినిమాలో టాలీవుడ్ యువ హీరో కార్తికేయ విలన్ గా నటించగా.. బోనీకపూర్ నిర్మించారు. హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన వాలిమై.. పాన్ ఇండియా లెవల్లో విడుదలైంది.
Next Story