Mon Dec 15 2025 07:27:15 GMT+0000 (Coordinated Universal Time)
200 థియేటర్లలో RRR గ్రాండ్ రీ రిలీజ్.. ఆస్కార్ కోసమా ?
రాజమౌళి దర్శకత్వం, కీరవాణి సంగీతం, చరణ్-ఎన్టీఆర్ ల నటకు, యాక్షన్ సన్నివేశాలకు అంతా ఫిదా అయ్యారు.

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా భారీ మల్టీస్టారర్ గా తెరకెక్కిన RRR గతేడాది (2022) మార్చి 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలై.. భారీ విజయం సాధించింది. ఇప్పటికీ RRRకు ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ దక్కుతోంది. రాజమౌళి దర్శకత్వం, కీరవాణి సంగీతం, చరణ్-ఎన్టీఆర్ ల నటకు, యాక్షన్ సన్నివేశాలకు అంతా ఫిదా అయ్యారు. అంతర్జాతీయంగా పదుల సంఖ్యలో అవార్డు అందుకున్న RRR ఇప్పుడు ఆస్కార్ ముంగిట నిలబడింది. నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ రావాలని అంతా కోరుకుంటున్నారు.
ఇప్పుడు RRR అమెరికాలో రీ రిలీజ్ కు సిద్ధమైంది. ఆస్కార్ కి మరో రెండు వారాలు టైం మాత్రమే ఉండటంతో రాజమౌళి ఈ డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. అమెరికాలో RRR సినిమాని మార్చ్ 3న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఏకంగా 200 థియేటర్లలో సినిమా రీ రిలీజ్ కాబోతోంది. దీంతో అక్కడి RRR అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హాలీవుడ్ అవార్డ్స్ HAC కి రామ్ చరణ్ ని ప్రజెంటర్ గా ఆహ్వానించగా.. చరణ్ ఇప్పటికే అక్కడికి చేరుకున్నాడు. కీరవాణి, చంద్రబోస్, రాజమౌళి కూడా అమెరికాలోనే ఉన్నారు. ఇక త్వరలోనే ఎన్టీఆర్ కూడా అమెరికా వెళ్లనున్నట్లు సమాచారం. వీరంతా కలిసి మార్చి 13న జరిగే ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.
Next Story

