Sat Dec 07 2024 23:09:39 GMT+0000 (Coordinated Universal Time)
"అఖండ" కు తరలివచ్చిన అఘోరాలు
విశాఖ జిల్లా నర్సీపట్నంలో గల బంగార్రాజు థియేటర్ కు అఘోరాలు అఖండ సినిమాను చూసేందుకు విచ్చేశారు.
దర్శకుడు బోయపాటి శీను - నందమూరి నటసింహం బాలకృష్ణ హ్యాట్రిక్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా అఖండ. డిసెంబర్ 2న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా "అఖండ" విజయాన్ని సొంతం చేసుకుంది. తొలిరోజే రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమాకు ఫస్టాఫ్ కన్నా.. సెకండాఫే ప్రాణం పోసిందని చెప్పాలి. సెకండాఫ్ లో బోయపాటి బాలయ్య విశ్వరూపాన్ని చూపించారు. సెకండాఫ్ లో బాలయ్యతో పాటు చిన్నారి ధీష్న నటన కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
పూనకంతో....
తాజాగా ఈ సినిమాను చూసేందుకు అఘోరాలు థియేటర్ కు వచ్చారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో గల బంగార్రాజు థియేటర్ కు అఘోరాలు అఖండను చూసేందుకు విచ్చేశారు. అంతే.. అభిమానులు పూనకంతో ఊగిపోయారు. అఘోరాలు సైతం బాలయ్య బాబు ఫ్యాన్స్ అయిపోయారంటూ కేరింతలు కొట్టారు. సినిమా చూసిన అనంతరం అఘోరాలు బాలయ్య అభిమానులతో మాట్లాడి.. అక్కడి నుండి వెళ్లిపోయారు.
Next Story