Mon Dec 09 2024 08:10:39 GMT+0000 (Coordinated Universal Time)
ఆదిపురుష్ 5 రోజుల కలెక్షన్స్.. బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా ?
విడుదలైనప్పటి నుంచి విమర్శలే కాకుండా.. సినిమాలో క్యారెక్టర్లు చెప్పిన డైలాగ్ లు వివాదాలకు దారితీశాయి.
ఆదిపురుష్.. ఆది నుంచి వివాదాల్లోనే ఉంది. టీజర్ రిలీజ్ నుంచి ఏదొక వివాదం చుట్టుముడుతుంది. సినిమా విడుదలయ్యాక.. అసలిది రామాయణమే కాదంటూ.. ప్రేక్షకులు పెదవి విరిచారు. కొందరు మాత్రం సినిమాను సినిమాలాగా చూస్తే బాగుంటుందని.. రామాయణంతో మాత్రం పోల్చలేమన్నారు. ఇంత నెగిటివిటీ, డైరెక్టర్, రైటర్లపై వివాదాలు ముసురుతున్నా.. ఆదిపురుష్ ఐదు రోజుల్లో రూ.395 కోట్లు రాబట్టిందని చిత్రయూనిట్ ప్రకటించింది.
రాఘవుడిగా ప్రభాస్, జానకిగా కృతి సనన్, లంకేష్ గా సైఫ్ అలీఖాన్ నటించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. విడుదలైనప్పటి నుంచి విమర్శలే కాకుండా.. సినిమాలో క్యారెక్టర్లు చెప్పిన డైలాగ్ లు వివాదాలకు దారితీశాయి. విడుదలకు ఎన్నో అంచనాలు ఉండడంతో బుకింగ్స్ పెద్దఎత్తున జరగడంతో.. ఆదిపురుష్ కు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. సినిమాపై నెగిటివ్ టాక్ రావడంతో.. రెండో రోజు నుంచి కలెక్షన్లు నెమ్మదిగా తగ్గుతూ వస్తున్నాయి. మొదటిరోజు ఈ సినిమా 140 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది. ఆ తర్వాతి రెండు రోజులు రూ.100 కోట్లు వసూలు చేసింది.
వీకెండ్ పూర్తయ్యే సరికి రూ.340 కోట్ల గ్రాస్ అందుకుంది. కానీ.. వీకెండ్ తర్వాత కలెక్షన్లు పడిపోయాయి. ఇప్పటి వరకు ఈ చిత్రం 395 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు చిత్ర యూనిట్ తెలియజేసింది. వసూళ్లు ఇలానే ఉంటే ఆదిపురుష్ కి బ్రేక్ ఈవెన్ కష్టమవుతుందంటున్నాయి ట్రేడ్ వర్గాలు. అయితే ఈ కలెక్షన్లు నిజమేనా ? లేక ఇంత కలెక్షన్ చూపిస్తే జనాలు థియేటర్లకు వస్తారని చెబుతున్నారా ? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఆదిపురుష్ ను థియేటర్లలోనే కాకుండా ఓటీటీల్లోకి కూడా రాకుండా బ్యాన్ చేయాలని ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ఏకంగా ప్రధానికి లేఖ రాసింది.
Next Story