Sun Feb 01 2026 21:16:31 GMT+0000 (Coordinated Universal Time)
ప్రగతి ఆంటీ లేటెస్ట్ వర్కవుట్ వీడియో చూశారా..
తన వర్కవుట్స్ వీడియోలతో నెటిజన్లు, ఫిట్ నెస్ ఫ్రీక్స్ హృదయాలను గెలుచుకున్నారామె. నటి ప్రగతి సోషల్ మీడియాలో చాలా..

టాలీవుడ్ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి మహావాది గురించి తెలియనివాళ్లుండరు. ప్రగతి ఆంటి అంటే వెంటనే గుర్తుపట్టేస్తారు. కరోనా మొదలైనప్పటి నుండి ప్రగతి ఆంటి పేరు మారుమోగిపోతోంది. సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యారు ప్రగతి. తన ఫిట్ నెస్ వీడియోలను నెటిజన్లతో పంచుకుంటూ.. అప్పుడప్పుడు సలహాలిస్తుంటారు. 46 ఏళ్ల వయసులోనే ఆమె ఇంత ఫిట్ నెస్ మెయింటేన్ చేయడం చూసిన వారంతా ఆశ్చర్యపోతారంటే అతిశయోక్తి కాదు.
తన వర్కవుట్స్ వీడియోలతో నెటిజన్లు, ఫిట్ నెస్ ఫ్రీక్స్ హృదయాలను గెలుచుకున్నారామె. నటి ప్రగతి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ లో ఓ వర్కవుట్ వీడియోను పంచుకున్నారు. ఆ పోస్ట్ కి consistency అని క్యాప్షన్ ఇచ్చారు. అంటే స్థిరత్వం. ఆ వీడయో చూసిన నెటిజన్లంతా.. నాలుగు పదుల వయసులోనూ ఫిట్ నెస్ కోసం మీరు చేస్తున్న వర్కవుట్స్ సూపర్.. కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి అని కామెంట్స్ చేస్తున్నారు.
Next Story

