Wed Dec 17 2025 14:15:09 GMT+0000 (Coordinated Universal Time)
శరత్ బాబు మృతిపై తొలిసారి స్పందించిన రమాప్రభ
సినీ రంగంలో ఒక నటుడిగా శరత్ బాబుకు గొప్ప స్థాయి రావడానికి కారణం తానేనన్న విషయాన్ని మరచిపోయి..

ప్రముఖ సీనియర్ నటుడు శరత్ బాబు అనారోగ్య కారణాలతో హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మే 22న కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆ మరుసటిరోజున కుటుంబ సభ్యులు చైన్నైలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. శరత్ బాబు వైవాహిక జీవితం సాఫీగా సాగలేదు. ముందు సినీ ఇండస్ట్రీకి చెందిన రమాప్రభను పెళ్లాడిన ఆయన.. మనస్పర్థలతో విడాకులు తీసుకున్నారు. 1974 లో వివాహం చేసుకున్న వీరిద్దరూ 1988 లో విడిపోయారు. రెండోపెళ్లి చేసుకున్నా అది కూడా పెటాకులైంది. శరత్ బాబు మరణంపై తాజాగా ఆయన మొదటి మాజీ భార్య, సినీ నటి రమాప్రభ తొలిసారి స్పందించారు.
ఓ యూట్యూబ్ ఛానల్ ద్వారా రమాప్రభ శరత్ బాబు మరణంపై మాట్లాడారు. శరత్ బాబు మరణం తర్వాత తనను చూసేవారికి ప్రశాంతంగా కనిపిస్తూ ఉండొచ్చు కానీ..శాస్త్ర ప్రకారం అన్ని కార్యక్రమాలను చేసుకుంటున్నానని తెలిపారు. హైందవ ధర్మాచారం ప్రకారం అన్నింటినీ పాటిస్తున్నానని వివరించారు. సినీ రంగంలో ఒక నటుడిగా శరత్ బాబుకు గొప్ప స్థాయి రావడానికి కారణం తానేనన్న విషయాన్ని మరచిపోయి తనపై లేనిపోనివన్నీ మాట్లాడుతున్నారని రమాప్రభ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా.. శరత్ బాబుకు వారసులు లేకపోవడంతో ఆయన ఆస్తిపాస్తులు ఎవరికి చెందాలన్న దానిపై అన్నికార్యక్రమాలు పూర్తయ్యాక నిర్ణయం తీసుకుంటామని ఆయన సోదరుడు తెలిపారు. లాకర్ లో ఉన్న వీలునామా ప్రకారం ఆస్తిపంపకాలు జరుగుతాయని, వీలునామా లేకపోతే తామే చర్చించుకుని నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
Next Story

