Wed Jan 21 2026 07:40:40 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పాయల్ రాజ్ పుత్
ఆదివారం ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. సాంప్రదాయబద్ధమైన లంగా ఓణీలో కనిపించి..

తిరుమల : ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ తిరుమలకు విచ్చేశారు. ఆదివారం ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. సాంప్రదాయబద్ధమైన లంగా ఓణీలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది పాయల్. ఈ సందర్భంగా పాయల్ మీడియాతో మాట్లాడుతూ.. ఆలయాన్ని సందర్శించడం, స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపింది.
ప్రస్తుతం తాను కొన్ని సినిమాల్లో నటిస్తున్నానని చెప్పిన పాయల్.. తెలుగులో మంచు విష్ణు సినిమాలో లేడీ లీడ్ రోల్ చేస్తున్నట్లు తెలిపింది. తీస్ మార్ ఖాన్, కిరాతక, గోల్ మాల్, హెడ్ బుష్ మొదలైన సినిమాలతో పాయల్ ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకి రానుంది. తిరుమలలో పాయల్ ను చూసిన అభిమానులు.. ఆమెతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు.
Next Story

