Thu Mar 19 2026 05:27:17 GMT+0530 (India Standard Time)
నటి పల్లవి ఘోష్ కు గాయాలు
నటి పల్లవి ఘోష్ గాయాలపాలయ్యారు. హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతుండగా ఆమె గాయపడ్డారు.

నటి పల్లవి ఘోష్ గాయాలపాలయ్యారు. హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతుండగా ఆమె గాయపడ్డారు. షూటింగ్ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని తెలిసింది. నటి పల్లవి ఘోష్ వ్యాక్సిన్ వార్ సెట్ లో షూటింగ్ లో ఉండగా వాహనం అదుపుతప్పి నటి పల్లవి ఘోష్ ను ఢీకొట్టింది.
ప్రాణాపాయం లేదని...
ఈ ఘటనలో పల్లవి ఘోష్ గాయపడటంతో ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె కు ప్రాణాపాయం లేదని, త్వరగానే కోలుకుంటున్నారని వైద్యులు చెబుతున్నారు. దీంతో షూటింగ్ ను నిలిపేశారు. కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందన్నది ఇంకా తెలియరాలేదు.
Next Story

