Sun Oct 13 2024 12:40:33 GMT+0000 (Coordinated Universal Time)
Megha Akash Marriage పెళ్లి చేసుకున్న హీరోయిన్ మేఘా ఆకాష్.. వరుడు అతడే!
వీరి పెళ్లి రిసెప్షన్ కు తమిళనాడు ముఖ్యమంత్రి MK స్టాలిన్
నటి మేఘా ఆకాష్ తెలుగు, తమిళ చిత్రాలతో బాగా పాపులర్. మేఘా ఆకాష్ నటుడు సాయి విష్ణుని వివాహం చేసుకుంది. సెప్టెంబర్ 15న చెన్నైలో ఈ వేడుక జరిగింది. తన చిరకాల మిత్రుడు సాయి విష్ణునే మేఘా ఆకాష్ చేసుకోవడం విశేషం. అనేక మంది ప్రముఖులు నటి వివాహానికి హాజరయ్యారు. ఈ జంటకు సోషల్ మీడియాలో అభిమానులు, స్నేహితులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు.
సాయివిష్ణు ప్రముఖ తమిళ రాజకీయ నాయకుడు తిరునావుకరసు కుమారుడు. వీరి పెళ్లి రిసెప్షన్ కు తమిళనాడు ముఖ్యమంత్రి MK స్టాలిన్, ఉదయనిధి, దురై మురుగన్‌తో సహా పలువురు రాజకీయ నాయకులు హాజరయ్యారు. మేఘా ఆకాష్, సాయివిష్ణు ఒక దశాబ్దం నుండి ఒకరికొకరు తెలుసు. వీరిద్దరూ గత 6 సంవత్సరాలుగా రిలేషన్షిప్లో ఉన్నారు. ఈ విషయం ఇరు కుటుంబాలకు తెలుసు. మేఘా ఆకాష్ గత ఆగస్టులో సాయి విష్ణుతో నిశ్చితార్థం చేసుకుంది. మేఘా ఆకాష్ లై, చల్ మోహన్ రంగ, రాజ రాజ చోర, గుర్తుందా శీతాకాలం, రావణాసుర, మను చరిత్ర లాంటి సినిమాల్లో నటించింది.
Next Story