Wed Dec 17 2025 14:13:17 GMT+0000 (Coordinated Universal Time)
తమిళ హీరోను పెళ్లి చేసుకున్న మధు శాలిని
తమిళ సినిమా పంచాక్షరంలో మధు శాలిని, గోకుల్ నటించారు.

టాలీవుడ్ నటి మధు శాలిని తమిళ నటుడు గోకుల్ ఆనంద్ ను పెళ్లి చేసుకుంది. ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఇటీవల డిస్నీ+హాట్‌స్టార్ వెబ్ సిరీస్ '9 అవర్స్'లో జర్నలిస్ట్‌గా కనిపించిన నటి మధు షాలిని కోలీవుడ్ నటుడు గోకుల్ ఆనంద్‌ను వివాహం చేసుకుంది. మధు, గోకుల్‌లు తమిళంలో 'పంచరాక్షరం' సినిమాలో కలిసి నటించారు. "మాకు లభించిన ప్రేమకు ధన్యవాదాలు. మా జీవితంలోని కొత్త అధ్యాయం కోసం మేము ఎంతగానో ఎదురు చూస్తున్నాము" అని నటి ట్విట్టర్లో చెప్పుకొచ్చింది. 2015లో కమల్ హాసన్ తో కలిసి 'చీకటి రాజ్యం'లో మధు కనిపించింది. అదే ఏడాది పవన్ కళ్యాణ్-వెంకటేష్ నటించిన 'గోపాల గోపాల'లో రిపోర్టర్‌గా నటించింది. ఆమె 'ఎక్స్పైరీ డేట్' వెబ్ సిరీస్‌లో, అడివి శేష్ యొక్క 'గూడాచారి'లో కూడా నటించారు.
తమిళ సినిమా పంచాక్షరంలో మధు శాలిని, గోకుల్ నటించారు. ఈ మూవీ టైమ్‌లోనే ఇద్దరి మధ్య చిగురించిన స్నేహ్నం ప్రేమగా, మారి వివాహం దాకా వెళ్ళింది. అల్లరి నరేష్ హీరోగా నటించిన కితకితలు సినిమాలో హీరోయిన్గా నటించింది. ఒక విచిత్రం, అగంతకుడు, కింగ్ (ఓ సాంగ్), వాడు-వీడు, గోపాల గోపాల వంటి తదితర చిత్రాల్లో నటించింది. వారి పెళ్లి ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. నూతన వధూవరులకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.గోకుల్ ఆనంద్ 2017లో 'చెన్నై 2 సింగపూర్' అనే తమిళ సినిమాతో కథానాయకుడిగా పరిచయం అయ్యాడు. 'తిట్టమ్ ఇరందు', 'నడువన్' చిత్రాల్లో చిన్న పాత్రల్లో కూడా నటించాడు.
News Summary - Madhu Shalini ties the knot with Gokul Anand, Actress Madhu Shalini weds filmmaker Gokul Anand
Next Story

