Sat Dec 07 2024 15:41:15 GMT+0000 (Coordinated Universal Time)
వచ్చే నెలలో పెళ్లి చేసుకుంటా : కీర్తి సురేశ్
వచ్చే నెలలో తన పెళ్లి జరగబోతుందని సినీనటి కీర్తి సురేష్ తెలిపారు
వచ్చే నెలలో తన పెళ్లి జరగబోతుందని సినీనటి కీర్తి సురేష్ తెలిపారు. ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నంత అనంతరం మీడియాకు ఆమె తన పెళ్లి విషయాన్ని తెలియజేశారు. కుటుంబ సమేతంగా వచ్చి శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాను ప్రేమించిన ఆంటోనిని వచ్చే నెలలో పెళ్లి చేసుకుంటున్నాని చెప్పారు. తమ వివాహం వచ్చే నెలలో గోవాలో జరుగుతుందని తెలిపారు.
గోవాలో పెళ్లి వేడుకలు...
డిసెంబరు 11,12 తేదీల్లో వారి వివాహ వేడుక జరుగుతుందని తెలిసింది. కీర్తి సురేష్ మహానటి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులందరికీ బాగా దగ్గరయ్యారు. పలు తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో కీర్తి సురేష్ వెల్లడించారు. కీర్తి సురేష్ నటించిన బాలీవుడ్ సినిమా బేబీ జాన్ డిసెంబర్ 25వ తేదీన విడుదల కానున్న నేపథ్యంలో ఆమె అభిమానులకు పెళ్లి కబురు అందించారు.
Next Story