Sun Dec 08 2024 07:01:16 GMT+0000 (Coordinated Universal Time)
నటి కస్తూరి అరెస్ట్.. ఎక్కడ పట్టుకున్నారంటే?
సినీ నటి కస్తూరిని చెన్నై పోలీసులు అదుపులోకి
సినీ నటి కస్తూరిని చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం నాడు గచ్చిబౌలిలో ఆమెను అరెస్టు చేసి చెన్నైకి తరలించారు. తెలుగువారిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కస్తూరి బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించినప్పటికీ ఆమెకు ఎలాంటి ఊరట దక్కలేదు. బ్రాహ్మణులకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేసే క్రమంలో తెలుగువారిపై కస్తూరి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపాయి. దీంతో ఆమె క్షమాపణలు చెప్పింది.
నటి కస్తూరిని చేరుకోడానికి పోలీసులు ప్రయత్నించగా ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. అరెస్ట్ చేస్తారనే భయంతో నటి కస్తూరి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కస్తూరి శంకర్ హైదరాబాద్లో ఉన్నారనే సమాచారం అందుకున్న తమిళనాడు పోలీసులు, ఇక్కడ ఆమెను అదుపులోకి తీసుకున్నారు. గచ్చిబౌలిలో ఆమె ఉందనే సమాచారం అందుకున్న చైన్నై పోలీసులు శనివారం కస్తూరి శంకర్ ఉన్న ప్రదేశానికి చేరుకుని అరెస్ట్ చేశారు.
Next Story