బిగ్ బాస్ నా పారితోషకం ఇవ్వలేదు అంటున్న మాజీ..?
బిగ్ బాస్ కి వెళ్లక ముందు అబ్బో.. అన్నవాళ్ళే వెళ్లొచ్చాక బిగ్ బాస్ ని నానా తిట్లు తిట్టడం అనేది సోషల్ మీడియాలోనూ, టివి ఛానల్స్ లోను [more]
బిగ్ బాస్ కి వెళ్లక ముందు అబ్బో.. అన్నవాళ్ళే వెళ్లొచ్చాక బిగ్ బాస్ ని నానా తిట్లు తిట్టడం అనేది సోషల్ మీడియాలోనూ, టివి ఛానల్స్ లోను [more]
బిగ్ బాస్ కి వెళ్లక ముందు అబ్బో.. అన్నవాళ్ళే వెళ్లొచ్చాక బిగ్ బాస్ ని నానా తిట్లు తిట్టడం అనేది సోషల్ మీడియాలోనూ, టివి ఛానల్స్ లోను చూస్తూనే ఉన్నాం. అయితే తనకి బిగ్ బాస్ యాజమాన్యం పారితోషకం ఇవ్వకుండా ఏడాది నుండి వేపుకుతింటున్నట్లుగా బిగ్ బాస్ సీజన్ 3 తమిళ కంటెస్టెంట్ అయిన మాజీ హీరోయిన్ కస్తూరి చెప్పడం నిజంగా వింతైన విషయమే. బిగ్ బాస్ సీజన్ 3 లోకి కమల్ హోస్టింగ్ లో అడుగుపెట్టిన నటి కస్తూరి.. ఆ షో లో ఎలిమినేట్ అయ్యాక తనకు రావాల్సిన పారితోషకం ఇంతవరకు ఇవ్వలేదట. అదే విషయాన్నీ తాజాగా కస్తూరి మట్లాడుతూ విజయ్ టివి పై సెటైర్స్ కూడా వేసింది. తనకు రావల్సిన పారితోషకం ఇప్పటికి ఇవ్వలేదని…. అప్పుడే ఏడాది అయ్యిందని… సీజన్ 4 కూడా మొదలైనా డబ్బు సెటిల్ చేయలేదంటూ దుమ్మెత్తిపోసింది.
గత కొన్నాళ్లుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో హైలెట్ అవుతున్న కస్తూరి.. ఇప్పుడు బిగ్ బాస్ పై నిప్పులు చెరిగింది. తాను బిగ్ బాస్ కి వెళ్ళింది పారితోషకాల కోసం కాదని.. బిగ్ బాస్ నుండి వచ్చే డబ్బుని అనాధ పిల్లల కోసం వినియోగించడం కోసమని.. కానీ తనకి డబ్బు ఇవ్వకుండా ఏడాదిగా తమిళ బిగ్ బాస్ యాజమాన్యం కాలయాపన చేస్తుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరి బిగ్ బాస్ కి వెళ్లొచ్చాక బిగ్ బాస్ స్క్రిప్ట్, అక్కడ నాటకాలాడతారు. అందరూ దొంగలే అంటూ మాట్లాడుతుంటారు కానీ…. ఇలా పారితోషకం ఏగ్గొట్టారనే విషయం మాత్రం కేవలం కస్తూరి మాత్రమే మాట్లాడుతుంది.