Fri Mar 21 2025 07:36:22 GMT+0000 (Coordinated Universal Time)
కమెడియన్ అభినవ్ పై నటి కల్పిక ఆరోపణలు
కల్పిక.. తన నటనకు అవార్డును పొందడం గురించి అభినవ్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించినట్లు చెప్పుకొచ్చింది. పూర్తి వివరాలు ఏమి..

ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ అభినవ్ పై.. సహాయ నటి కల్పిక గణేష్ ఆరోపణలు చేసింది. 'ప్రయాణం', ' జులాయి', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు' వంటి సినిమాల్లో సహాయనటిగా నటించి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. 'ఈ నగరానికి ఏమైంది' సినిమాలో తన కామెడీ టైమింగ్ తో అందరి దృష్టిని ఆకర్షించిన నటుడు, కమెడియన్ "అభినవ్ గోమటం" పై కల్పిక ఆరోపణలు చేసింది. వీరిద్దరి మధ్య కొద్దిరోజులుగా సోషల్ మీడియా వేదికగా మాటలయుద్ధం జరుగుతోంది.
కల్పిక.. తన నటనకు అవార్డును పొందడం గురించి అభినవ్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించినట్లు చెప్పుకొచ్చింది. పూర్తి వివరాలు ఏమి తెలియనప్పటికీ, వీరిద్దరి మధ్య గొడవ మాత్రం తారాస్థాయికి చేరుకుంది. సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు పోస్టులు వేస్తూ దూషించుకుంటున్నారు. అభినవ్ తనని ఐటెం అంటూ కించపరిచేలా మాట్లాడిన చాట్స్ ని షేర్ చేస్తూ.. అతడు తనకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కల్పిక డిమాండ్ చేస్తుంది. మహిళల పట్ల ఇలా ప్రవర్తించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ.. టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను, సైబర్ క్రైమ్ పోలీసులను, అలాగే కొందరు సెలబ్రిటీస్ ని ట్యాగ్ చేస్తూ పోస్టులు పెట్టింది.
Next Story