Fri Dec 19 2025 02:29:28 GMT+0000 (Coordinated Universal Time)
విక్రమ్ కు హార్ట్ అటాక్
నటుడు చియాన్ విక్రమ్ అస్వస్థతకు గురవ్వడంతో చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరారు.

నటుడు చియాన్ విక్రమ్ అస్వస్థతకు గురవ్వడంతో చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రి వర్గాల ప్రకారం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ప్రస్తుతం ఆసుపత్రిలో వైద్యుల సంరక్షణలో ఉన్నారు. చెన్నైలో సాయంత్రం 6 గంటలకు జరగాల్సిన పొన్నియిన్ సెల్వన్ టీజర్ లాంచ్లో విక్రమ్ పాల్గొనాల్సి ఉంది.
చియాన్ విక్రమ్కు గుండెపోటు రావడంతో వెంటనే చెన్నైలోని కావేరి ఆసుపత్రికి తరలించారు. యాంజియోప్లాస్టీ చేయించుకున్నారని తెలుస్తోంది. ఈరోజు ఆయన డిశ్చార్జి అయ్యే అవకాశం ఉంది. త్వరలో మెడికల్ బులెటిన్ వెలువడే అవకాశం ఉంది. ఈరోజు టీజర్ లాంచ్కు తాను హాజరు కావడం లేదని విక్రమ్ పొన్నియిన్ సెల్వన్ టీమ్కి తెలియజేశారు. కొన్ని రోజుల పాటూ విక్రమ్ విశ్రాంతి తీసుకోనున్నారు. జూలై 11న జరగనున్న 'కోబ్రా' సినిమా ఆడియో లాంచ్కు హాజరవుతారు.
చియాన్ విక్రమ్ నటించిన 'పొన్నియిన్ సెల్వన్' సినిమా విడుదల కోసం సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ సినిమా మొదటి భాగం సెప్టెంబర్ 30న థియేటర్లలోకి రానుంది. విక్రమ్ నటించిన కోబ్రా సినిమా ఆగష్టు 11న విడుదలకానుంది. ఇది ఇమైక్కా నోడిగల్ ఫేమ్ దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు తీస్తున్న సినిమా. ఈ సినిమాలో భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్, శ్రీనిధి శెట్టి, మిర్నాళిని రవి, KS రవికుమార్, మియా జార్జ్ తదితరులు ఉన్నారు.
News Summary - Actor chiyaan Vikram admitted to Kauvery hospital in Chennai
Next Story

