Wed Mar 11 2026 20:00:02 GMT+0530 (India Standard Time)
మోదీకి ప్రకాష్ రాజ్ సూటి ప్రశ్న
ప్రధాని నరంద్రమెదీపై విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి మండిపడ్డారు.

ప్రధాని నరంద్రమెదీపై విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి మండిపడ్డారు. రైతులకు క్షమాపణలు చెబితే సరిపోతుందా? అని ప్రశ్నించారు. రైతులకు క్షమాపణ చెబితే సరిపోదని, జరిగిన నష్టానికి బాధ్యత వహిస్తారా? అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. రైతులు ఏడాదికి పైగా ఢిల్లీ సరిహద్దుల్లో మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ నిరసన చేస్తున్న నేపథ్యంలో మోదీ చట్టాలను వెనక్కు తీసుకుంటామని ప్రకటించిన సంగతి తెలిసిందే.
జరిగిన నష్టానికి....
అయితే దీనిపై ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. ఏడాదిన్నరగా రైతులు చలిలో, వర్షంలో తడుస్తూ ఉద్యమం చేశారని, ఎందరో ప్రాణాలు కోల్పోయారని, జరిగిన నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు.
Next Story

