Wed Dec 17 2025 14:14:47 GMT+0000 (Coordinated Universal Time)
వాలెంటైన్స్ డే రోజు తన భార్యను రివీల్ చేసిన నవీన్ చంద్ర
హీరోకి సంబంధించిన వ్యక్తిగత జీవితం.. అంటే కుటుంబం, ప్రేమ, పెళ్లి ఇలా అన్ని విషయాలు నెట్టింట్లో ఇట్టే తెలిసిపోతుంటాయి. కాని కొందరు

టాలీవుడ్ నటుల్లో చాలా మంది తమ వ్యక్తిగత జీవితాలను చాలా గోప్యంగా ఉంచుతుంటారు. హీరోకి సంబంధించిన వ్యక్తిగత జీవితం.. అంటే కుటుంబం, ప్రేమ, పెళ్లి ఇలా అన్ని విషయాలు నెట్టింట్లో ఇట్టే తెలిసిపోతుంటాయి. కాని కొందరు నటులు మాత్రం తమ వ్యక్తిగత జీవితాన్ని అంత త్వరగా బహిర్గతం చేసేందుకు ఇష్టపడరు. వారిలో ఒకరిగా చేరారు నటుడు నవీన్ చంద్ర. అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నవీన్ చంద్ర.. టాలీవుడ్ లో మంచి నటుడిగా, విలన్ గా రాణిస్తున్నాడు. ఇప్పటి వరకూ నవీన్ చంద్ర తన వ్యక్తిగత జీవితం గురించి ఎక్కడా ప్రస్తావించలేదు.
Also Read : ప్రేయసిని మరిచిపోలేక.. రిమాండ్ ఖైదీ ఆత్మహత్య
మొదటిసారిగా.. వాలెంటైన్స్ డే సందర్భంగా తన భార్య ఓర్మా ను అభిమానులకు పరిచయం చేశాడు. తన ఇన్ స్టా ఖాతాలో వారిద్దరూ కలిసున్న ఫొటోను షేర్ చేసి.. "ప్రేమ ఎప్పుడూ హృదయంలోనే ఉంటుంది. హ్యాపీ వాలెంటైన్స్ డే వైఫీ. తనే నా భార్య ఓర్మా" అని నెటిజన్లకు తెలిపాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. నవీన్ చంద్ర అభిమానులైతే.. ఎవరికీ చెప్పకుండా ఎప్పుడు పెళ్లి చేసుకున్నావ్ అని ప్రశ్నిస్తున్నారు. పలువురు నెటిజన్లు శుభాకాంక్షలు తెలిపారు.
News Summary - Actor Naveen Chandra Introduced his Wife Orma on Valentine's Day
Next Story

