Fri Dec 05 2025 12:38:44 GMT+0000 (Coordinated Universal Time)
Mohan Babu : రేవంత్ కామెంట్స్ కు రియాక్టయిన మోహన్ బాబు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన సూచనలకు సినీనటుడు మోహన్ బాబు స్పందించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన సూచనలకు సినీనటుడు మోహన్ బాబు స్పందించారు. డ్రగ్స్ ను తెలంగాణలో నిరోధించేందుకు, మాదకద్రవ్యాల నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు సినీ పరిశ్రమ సహకరించాలని కోరారు. సినిమా తీసిన వాళ్లు అనుమతులు కోరే ముందు ఆ చిత్రంలో ఉన్న తారాగణంతో రెండు, మూడు నిమిషాల నిడివితో డ్రగ్స్ కు వ్యతిరేకంగా వీడియోలు రూపొందించాలని రేవంత్ రెడ్డి కోరారు.
తాను ఇది వరకే...
సంపాదించుకోవడం కాదని, సమాజానికి కొంత తిరిగి ఇవ్వాలని కూడా రేవంత్ రెడ్డి సూచించారు. ఇందుకు ఎక్స్ లో మోహన్ బాబు స్పందిస్తూ తాను ఇదివరకే కొన్ని సందేశాత్మకమైన వీడియోలు తీశానని, సమాజానికి సేవ చేసేందుకు తాను సిద్ధమని మోహన్ బాబు ప్రకటించారు. రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి ఎక్స్ ఖాతాలకు ఇది ట్యాగ్ చేశారు.
Next Story

