Fri Dec 19 2025 02:28:51 GMT+0000 (Coordinated Universal Time)
ఆస్పత్రిలో చేరిన కమల్.. కలవరపడుతోన్న అభిమానులు
తన గురువు, నటుడు, దర్శకుడైన కళాతపస్వి విశ్వనాథ్ ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. రాత్రికి హైదరాబాద్ నుండి బయల్దేరి..

ప్రముఖ దిగ్గజ నటుడు కమల్ హాసన్ స్వల్ప అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారు. నిన్ననే హైదరాబాద్ వచ్చిన కమల్.. తన గురువు, నటుడు, దర్శకుడైన కళాతపస్వి విశ్వనాథ్ ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. రాత్రికి హైదరాబాద్ నుండి బయల్దేరి చెన్నై చేరుకున్నారు. అంతలోనే కమల్ అస్వస్థతకు గురయ్యారన్న వార్తలు వచ్చాయి. దాంతో అభిమానుల్లో కలవరం మొదలైంది. రెగ్యులర్ హెల్త్ చెకప్ లో భాగంగానే కమల్ ఆస్పత్రిలో చేరినట్లు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి.
జ్వరానికి చికిత్స చేసిన వైద్యులు రెండు రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈరోజే ఆస్పత్రి నుండి డిశ్చార్జి కావొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం కమల్ తమిళ బిగ్బాస్ సీజన్-6తో పాటు, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇండియన్-2 (భారతీయుడు-2) షూటింగుతో బిజీగా ఉన్నారు.
Next Story

