Thu Mar 19 2026 06:29:43 GMT+0530 (India Standard Time)
Chandramohan : నేడు చంద్రమోహన్ అంత్యక్రియలు
నేడు సినీనటుడు చంద్రమోహన్ అంత్యక్రియలు జరగనున్నాయి. పంజాగుట్టు స్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయని బంధువులు తెలిపారు

నేడు సినీనటుడు చంద్రమోహన్ అంత్యక్రియలు జరగనున్నాయి. పంజాగుట్టు స్మశాన వాటికలో అంత్యక్రియలు జరగనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. సీనియర్ నటుడు చంద్రమోహన్ గత కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మరణించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ పరిశ్రమ చంద్రమోహన్ మృతికి సంతాపాన్ని ప్రకటించింది.
పెద్ద కుమార్తె రావడంతో...
అయితే ఆయన శనివారం మరణించినా పెద్ద కుమార్తె మధుర మీనాక్షి అమెరికా నుంచి రావాల్సి రావడంతో అంత్యక్రియలు ఆలస్యమయ్యాయి. చంద్రమోహన్ కు ఇద్దరు కుమార్తెలు కాగా, పెద్ద కుమార్తె అమెరికాలో సైకాలజిస్టుగా పనిచేస్తున్నారు. ఆమె నిన్న హైదరాబాద్ చేరుకున్నారు. ఈరోజు చంద్రమోహన్ అంత్యక్రియలు నిర్వహిస్తామని బంధువులు చెబుతున్నారు.
Next Story

