Fri Dec 05 2025 20:13:07 GMT+0000 (Coordinated Universal Time)
విశ్వక్ సేన్ పై అర్జున్ ఫైర్.. అతనితో సినిమా?
విశ్వక్ సేన్ తో సినిమాను తాను చేయడం లేదని సినీ నటుడు అర్జున్ తెలిపారు

విశ్వక్ సేన్ తో సినిమాను తాను చేయడం లేదని సినీ నటుడు అర్జున్ తెలిపారు. తమ సినిమా నుంచి విశ్వక్ సేన్ బయటకు వచ్చాడని వార్తలు వచ్చాయని, ఆ వార్తలు ఎందుకు వచ్చాయో తనకు తెలియదన్నారు. తన కూతురిని తెలుగులో హీరోయిన్ పరిచయం చేద్దామనుకున్నానని చెప్పారు. స్టోరీ చెప్పాక విశ్వక్ సేన్ కు కూడా స్టోరీ నచ్చిందని చెప్పాడని, అయితే షూటింగ్ రాకుండా ఇబ్బంది పెట్టాడని అర్జున్ మీడియా సమావేశంలో తెలిపారు.
ఎవరికీ అన్ని కాల్స్ చేయలేదు...
తన జీవితంలో ఎవరికీ అన్ని కాల్స్ చేయలేదని, విశ్కక్ సేన్ కు చేశానని అర్జున్ తెలిపారు. కేరళలో షూటింగ్ మొదలు పెట్టినప్పుడు అతని మేనేజర్ టైం కావాలని అడిగానని, తర్వాత షెడ్యూల్ లో జగపతిబాబు ఉన్నారన్నారు. ఆయన డేట్స్ కూడా విశ్వక్ సేన్ కారణంగా వేస్ట్ అయ్యాయని ఆవేదన చెందారు. సీనియర్ హీరోలే ఎంతో కమిట్ మెంట్ తో పనిచేస్తున్నారని, అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు అంకిత భావంతో పనిచేస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. తాను ఇలాంటి వాతావరణంలో సినిమా తీయలేనని అర్జున్ తెలిపారు.
- Tags
- arjun
- viswak sen
Next Story

