Sun Nov 09 2025 18:32:21 GMT+0000 (Coordinated Universal Time)
మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్... ఆచార్య విడుదల ఎప్పుడంటే?
ఆచార్య సినిమా మేకర్స్ మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు.ఏప్రిల్ ఒకటోతేదీన మూవీని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు

ఆచార్య సినిమా మేకర్స్ మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్ ఒకటోతేదీన ఆచార్య మూవీని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఆచార్య విడుదల తేదీని ప్రకటించడంతో మెగా ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు. నిజానికి ఆచార్య మూవీ వచ్చే ఫిబ్రవరి 4వ తేదీన విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా పరిస్థితుల దృష్ట్యా చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు ఆచార్య చిత్రం యూనిట్ ప్రకటించింది.
ఏప్రిల్ 1వ తేదీ....
కానీ మరోసారి ఆచార్య విడుదలపై చర్చించిన చిత్ర యూనిట్ ఏప్రిల్ 1వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించింది. మెగా స్టార్ చిరంజీవి నటించిన ఆచార్య మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ ఆశతో ఎదురు చూస్తున్నారు. వారికి చిత్ర యూనిట్ గుడ్ న్యూస్ చెప్పింది.
Next Story

