Sun Dec 14 2025 02:03:22 GMT+0000 (Coordinated Universal Time)
హీరోయిన్ ను పెళ్లి చేసుకున్న ఆది పినిశెట్టి
ఆది పినిశెట్టి హీరోయిన్ నిక్కీ గల్రానీని పెళ్లి చేసుకున్నాడు. వీరి పెళ్ళికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. సంప్రదాయబద్ధంగా వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు

ఆది పినిశెట్టి హీరోయిన్ నిక్కీ గల్రానీని పెళ్లి చేసుకున్నాడు. వీరి పెళ్ళికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. సంప్రదాయబద్ధంగా వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. నిక్కీ బంగారు రంగు చీరలో ముస్తాబై కనిపించగా.. ఆది పినిశెట్టి కుర్తా ధరించి కనిపించాడు. హల్దీతో పెళ్లి వేడుక ప్రారంభమైంది. వారి సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఈ జంట పెళ్ళికి నటులు నాని, సందీప్ కిషన్.. పరిశ్రమ నుండి మరికొంత మంది హాజరయ్యారు.
ఈ ఏడాది మార్చి నెలలోనే వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో తమ నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫోటోలను పోస్టు చేసి.. అందరినీ ఆశ్చర్యపరిచారు. నిశ్చితార్థ వేడుకకు సన్నిహిత కుటుంబ సభ్యులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. మీడియా నివేదికల ప్రకారం, ఈ జంట చాలా సంవత్సరాలు డేటింగ్లో ఉన్నారు. వారి అనుబంధం గురించి అతి తక్కువమందికి మాత్రమే తెలుసు. వీరిద్దరూ అనేక సందర్భాల్లో కలిసి కనిపించిన తర్వాత మాత్రమే వారి ప్రేమ గురించిన వార్తలు వెలువడ్డాయి. ఇద్దరు కలిసి పలు సినిమాల్లో నటించారు. మలుపు, మరకతమణి వంటి ప్రాజెక్ట్‌లలో కలిసి నటించారు. ఇద్దరి కుటుంబాలకు సంబంధించి ఏ ఫంక్షన్స్ జరిగినా కలిసి కనిపించే వారు.
రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న 'ది వారియర్' సినిమాలో ఆది పినిశెట్టి విలన్‌గా కనిపించనున్నారు. ఈ యాక్షన్ చిత్రంలో రామ్ పోతినేని సరసన కీర్తి శెట్టి కథానాయికగా నటించింది. జూలై 14న సినిమా హాళ్లలో విడుదల కానుంది.
News Summary - Aadhi Pinisetty and Nikki Galrani Wedding: Newlyweds twin in gold attires as they get hitched; PICS
Next Story

