Fri Dec 05 2025 13:37:42 GMT+0000 (Coordinated Universal Time)
నిఖిల్ మూవీలో ప్రమాదం.. కొందరికి గాయాలు
హీరో నిఖిల్ సినిమా షూటింగ్ లో భారీ ప్రమాదం జరిగింది

హీరో నిఖిల్ సినిమా షూటింగ్ లో భారీ ప్రమాదం జరిగింది. ది ఇండియన్ హౌస్ సినిమా షూటింగ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. సముద్రం సీన్స్ ను చిత్రీకరించేందుకు ఏర్పాటు చేసిన భారీ వాటర్ ట్యాంక్ పగిలిపోవడంతో లొకేషన్ మొత్తం వరద తో ముంచెత్తింది. దీంతో పలువురికి గాయాలయ్యాయని ప్రాధమికంగా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది.
అసిస్టెంట్ కెమెరామెన్ కు...
ఈ ప్రమాదంలో అసిస్టెంట్ కెమెరా మెన్ కు తీవ్ర గాయాలు కాగా వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరికొంత మందికి గాయాలు అయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. శంషాబాద్ సమీపంలో ఘటన జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా అందాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
Next Story

