Sun Nov 03 2024 15:30:29 GMT+0000 (Coordinated Universal Time)
చిరు సినిమా సెట్ లో అగ్నిప్రమాదం
చిరంజీవి సినిమా సెట్ లో అగ్ని ప్రమాదం జరిగింది. హైదరాబాద్ లోని కోకాపేట్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో సెట్ కాలిపోయింది.
చిరంజీవి సినిమా సెట్ లో అగ్ని ప్రమాదం జరిగింది. హైదరాబాద్ లోని కోకాపేట్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో సెట్ కాలిపోయింది. అయితే గతంలో చిరంజీవి నటించిన ఆచార్య సినిమా కోసం ఈ టెంపుల్ సెట్ ను నిర్మించారు. దానిని అలాగే ఉందచారు 2022లో నిర్మించిన సెట్ నిన్న రాత్రి అగ్నిప్రమాదం జరిగి దగ్దమయింది.
స్థానికుల సమాచారంతో...
ఒక్కసారిగా భారీగా మంటలు వ్యాపించడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. అక్కడ ధర్మస్థలి టెంపుల్ సెట్ ను వేసి ఇంకో సినిమా షూటింగ్ కోసం వదిలేసినట్లు తెలిసింది. అగ్నిప్రమాదానికి గల కారణాల కోసం అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.
Next Story