Sat Dec 07 2024 14:26:40 GMT+0000 (Coordinated Universal Time)
మీరు తప్పనిసరిగా చూడాల్సిన సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.. చూసేయండి!!
తెలుగులో కమర్షియల్ సినిమాలే కాదు.. మంచి మంచి సినిమాలు కూడా
తెలుగులో కమర్షియల్ సినిమాలే కాదు.. మంచి మంచి సినిమాలు కూడా వస్తూ ఉంటాయి. అలాంటి కోవకే చెందిన సినిమా '35'. ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ అయినప్పుడు చాలామంది ప్రశంసలు కురిపించారు. అయితే ఎక్కువ థియేటర్లు దక్కకపోవడం, బీ,సీ సెంటర్లలో అసలు రిలీజ్ చేయకపోవడంతో ఈ సినిమా ప్రేక్షకులకు రీచ్ అవ్వలేదు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చూసేయండి. మీ హృదయాలను తప్పకుండా కదిలించే సినిమా ఇది.
నివేతా థామస్ కీలక పాత్ర పోషించిన సినిమా '35 - చిన్న కథ కాదు'. ఈ మధ్య కాలంలో టాలీవుడ్లో వచ్చిన మంచి సినిమాల్లో ఈ సినిమా కూడా ఒకటి. ఆహా వీడియోలో సినిమా ఓటీటీలో ప్రసారం అవుతోంది. వినోదం, సందేశం కలగలిపిన అందమైన భావోద్వేగాల మేళవింపుతో రూపొందిన చిత్రమిది. ఇందులో నివేదా థామస్ అద్భుతమైన ప్రదర్శనకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సినిమా యూనిట్ చేసిన బలహీనమైన ప్రమోషన్స్ సినిమా బాక్సాఫీస్ రన్‌ను భారీగా ప్రభావితం చేశాయి. అయితే ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమాను చూసి ఎంతో మంది మంచి సినిమాను థియేటర్లలో మిస్ అయ్యామే అని ఫీల్ అవుతూ ఉన్నారు.
Next Story