అక్కడ జోకర్ చిత్రమే హైయెస్ట్ అంట
గాంధీ జయంతి రోజు ఇండియాలో మూడు భారీ చిత్రాలు రిలీజ్ అయ్యాయి. తెలుగు నుంచి సైరా, హిందీ నుంచి మల్టీ స్టారర్ మూవీ వార్, హాలీవుడ్ నుంచి [more]
గాంధీ జయంతి రోజు ఇండియాలో మూడు భారీ చిత్రాలు రిలీజ్ అయ్యాయి. తెలుగు నుంచి సైరా, హిందీ నుంచి మల్టీ స్టారర్ మూవీ వార్, హాలీవుడ్ నుంచి [more]

గాంధీ జయంతి రోజు ఇండియాలో మూడు భారీ చిత్రాలు రిలీజ్ అయ్యాయి. తెలుగు నుంచి సైరా, హిందీ నుంచి మల్టీ స్టారర్ మూవీ వార్, హాలీవుడ్ నుంచి జోకర్ ఒకేసారి రిలీజ్ అయ్యాయి. ఈ మూడు చిత్రాలు హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. మూడింటికి మూడు పాజిటివ్ టాక్స్ దక్కించుకోవడంతో వీటి మధ్య పోటీ రసవత్తరంగా మారింది. చెన్నై సిటీలో దేశీయ సినిమాలైన సైరా, వార్ ల కంటే జోకర్ మూవీ ఎక్కువ వసూళ్లు సాధించి ఝలక్ ఇచ్చింది. జోకర్ చిత్రం చెన్నై సిటీలో రూ.19 లక్షలు వసూళ్లు సాధించగా, సైరా, వార్ చిత్రాలు సరి సమానంగా 14 లక్షల వసూళ్లు రాబట్టాయని సమాచారం. హాలీవుడ్ లో రిలీజ్ కి ముందే సెన్సేషన్ క్రియేట్ చేసిన జోకర్ చిత్రం వరల్డ్ వైడ్ గా మొదటిరోజు 5.4 మిలియన్ వసూళ్లు రాబట్టినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా జోకర్ పాత్ర లో నటించిన ఫీనిక్స్ నటన గురించి మాట్లాడుకుంటున్నారు.
