Tue Dec 30 2025 05:06:30 GMT+0000 (Coordinated Universal Time)
యూట్యూబ్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన 2.ఓ

సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సుభాష్ కరణ్ నిర్మిస్తున్న భారీ చిత్రం ‘2.0’. భారతీయ చలన చిత్ర చరిత్రలోనే తొలిసారి 600 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మాణం జరుపుకుంటున్న ఈ సినిమా నవంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కాబోతోంది. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను చెన్నైలో చాలా గ్రాండ్‌గా విడుదల చేశారు. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఎలాంటి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయనేది ఈ ట్రైలర్‌కి వచ్చిన వ్యూస్ చూస్తే అర్థమవుతుంది. కేవలం పది రోజుల్లోనే 140 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి రికార్డు సృష్టించింది ‘2.0’. 14 కోట్ల మంది ఈ ట్రైలర్‌ను వీక్షించారంటే ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
Next Story

