2 .0 వల్ల ఎన్ని ఇబ్బందులో?

ఈ మధ్య కాలంలో ఒక భారీ బడ్జెట్ సినిమా వస్తుంది అంటే ఆ సినిమా బడ్జెట్ మొత్తాన్ని ఒకే ఒక్క వారంలో రాబట్టుకుంటేనే.. నిర్మాతలు గట్టెక్కే పరిస్థితులు ఉన్నాయి. ఇక పట్టుమని 50 రోజులు ఆడిన సినిమాలు వేళ్ళమీద లేక్కేట్టే విధంగా వున్నాయంటే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అర్ధమవుతుంది. అందుకే పెద్ద సినిమాల విడుదల విషయంలో నిర్మాతలు డేట్స్ క్లాష్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొన్నటికి మొన్న మహేష్ భరత్ అనే నేను, అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమాలు రెండు ఏప్రిల్ 27 నే విడుదల చేస్తామని నిర్మాతలు ఫిక్స్ అవడము ఇద్దరి మధ్యన డేట్ విషయంలో విభేదాలు తలెత్తడం చూసాం.
ఇక నిన్న రజినీకాంత్ 2.0 సినిమాని ఏప్రిల్ విడుదల అంటూ ప్రకటించి కన్ఫ్యూషన్ లో పడేసారు. ఈ దెబ్బకి మహేష్ నిర్మాత డి.వి.వి. దానయ్య, అల్లు అర్జున్ నిర్మాత బన్నీ వాస్ లు సోషల్ మీడియా సాక్షిగా 2.0 నిర్మాత లైకా ప్రొడక్షన్స్ మీద విరుచుకుపడ్డారు. అయినా వారినుండి సమాధానం రాకపోయేసరికి ఇప్పుడు మహేష్ బాబు ఏప్రిల్ 27 డేట్ నుండి ముందుకు జరిగినట్లుగా వార్తలొస్తున్నాయి. మహేష్ - కొరటాల భరత్ అనే నేను సినిమాని ఏప్రిల్ 13 న కూల్ గా విడుదల చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారట. అలాగే మరోపక్క అల్లు అర్జున్ నా పేరు సూర్య కూడా అనుకున్న తేదీ కన్నా ఒక వారం ముందుకు జరిగి ఏప్రిల్ 20 కి వస్తుందనే టాక్ వినబడుతుంది.
మరి వీళ్ళ మధ్యలో క్లాష్ కాకూండా జాగ్రత్తలు పడుతున్నప్పటికీ అటు లైకా వారు మాత్రం 2.0 డేట్ ని ప్రకటించకుండా కేవలం ఏప్రిల్ అనడం మాత్రం ఇంకా అర్ధంకాని విషయమే. మరి వారు ఏప్రిల్ లో ఏ డేట్ ని లాక్ చేస్తారో అనేది క్లారిటీ లేక చాలామంది నిర్మాతలు చాలా రాకాలుగా ఇబ్బందులు పడుతున్నారనేది మాత్రం వాస్తవం.

