2 .0 విలన్ క్లారిటీ ఇచ్చినట్టేనా?

శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 2.0 రిలీజ్ డేట్ పై ఇంకా క్లారిటీ లేదు. అయితే జనవరి 25న విడుదల చేస్తామని గతంలో ప్రకటించిన చిత్ర బృందం ఆ తర్వాత ఆ డేట్ పై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఈ మధ్యలో 2.0 ఏప్రిల్‌కి వాయిదా పడిందని వార్తలు వస్తున్నా కానీ ఆడియో విడుదల చేసేయడంతో, ఎప్పుడో ఏప్రిల్‌లో వచ్చే సినిమాకి అప్పుడే ఆడియో ఎందుకు విడుదల చేస్తారనే సందేహాలు మొదలయ్యాయి. విడుదలకు ఇంకా ఆరునెలల టైం ఉన్నపుడు అప్పుడే ప్రమోషన్ కార్యక్రమాలు నిర్బహించరు కదా...అది అసలు డౌట్.
అసలు 2.0 వాయిదా పడిందనే గాలి వార్తలే తప్ప.. చిత్ర బృందం గాని.. నిర్మాతలు గాని ఎక్కడా క్లారిటీ ఇవ్వలేదు. అయితే 2.0 జనవరి 25 న విడుదల అయ్యే అవకాశం ఉందని బయ్యర్లు ముందుగానే థియేటర్స్ బ్లాక్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఆసక్తికర విషయం ఏమిటంటే.... జనవరి 26న 2.0 లో విలన్ గా నటించిన అక్షయ్ కుమార్.... తాను హీరోగా తెరకెక్కిన పద్మన్ సినిమా రిలీజ్ చేస్తున్నానని ప్రకటించాడు. మరి ఈ సినిమాకి తనే హీరో కావడం... అలాగే నిర్మాత కూడా. అయితే దీని గురించి అక్షయ్‌కుమార్ ని మీడియా ప్రశ్నించగా... నేను విలన్ గా నటించిన 2.0 .. అలాగే హీరోగా నటించిన పద్మన్ రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదని కుదిరితే నా సినిమా పద్మన్ ను వాయిదా కూడా వేసుకుంటాని చెప్పినట్టు తెలుస్తుంది.
కాకపోతే హిందీ సినిమాలకి రిలీజ్ డేట్ ముందుగా ఫిక్స్ చేసేసుకోవాలి. 2.0పై ఎలాంటి న్యూస్ లేకుండా అక్షయ్ ఈ పని చేయడు కనుక ఈ చిత్రం ఏప్రిల్‌కి వాయిదా పడిందనేది ఫిక్స్ చేసేసుకోవచ్చు.

