2.0 రిలీజ్ పెద్ద చిచ్చు రేపెలా ఉంది

రోబో 2.0 సినిమా రిలీజ్ పెద్ద చిచ్చు రేపెలా ఉంది. ఇంకా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేయకపోవడంతో వేరే సినిమాలకు పెద్ద అడ్డంకిగా మారుతోంది. 2.0 ఏప్రిల్ 13 విడుదల అవుతుందనే అంచనా ప్రకారమే మిగిలిన సినిమాల నిర్మాతలు ప్లానింగ్ లో ఉన్నారు.
అయితే నాని కృష్ణార్జున యుద్ధం, విశాల్ పందెం కోడి 2 ఏప్రిల్ 12 కి రావాలని డిసైడ్ కావడమే కాక ప్రకటనలు కూడా ఇచ్చేసారు. అంటే రోబో ఏప్రిల్ 13 న వచ్చే ఛాన్స్ లేదు. ఇక తర్వాత వున్న డేట్ ఏప్రిల్ 29, అప్పటికి మహేష్ బాబు సినిమా భరత్ అనే నేను ఉంది. ఆ తర్వాత అల్లు అర్జున్ సినిమా నా పేరు సూర్య వస్తుంది.
ఇప్పుడు 2.0 ఏప్రిల్ చివరి వారం లో వస్తే దాని ప్రభావం మిగిలిన సినిమాల మీద చాలా తీవ్రంగా ఉంటుంది. మరి మహేష్ బాబు, అల్లు అర్జున్.. రజనితో పోటీ పడితే నష్టం ఈ ఇద్దరికే. అందుకే లైకా సంస్థపై రెండు సినిమాల నిర్మాతలు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. మరి ఈ గొడవ ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.

