14 రీల్స్ లో మహేష్ డైరెక్టర్ ఆయనేనా?

మహేష్ బాబు ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో 'భరత్ అనే నేను' సినిమా షూటింగ్ తో బిజీగా వున్నాడు. ఆతర్వాత వంశి పైడిపల్లి తో మరో సినిమాకి కమిట్ అయిన మహేష్ తాజాగా 14 రీల్స్ వారికి ఒక సినిమా చేస్తానని మాటిచ్చాడు. అయితే 14 రీల్స్ వారు మహేష్ కోసం ఒక మంచి కథతో పాటే ఒక టాలెంటెడ్ డైరెక్టర్ ని కూడా వెతుకుతున్నారనే న్యూస్ ఉంది. అయితే మహేష్ కోసం 14 రీల్స్ వారు తమకి 'లెజెండ్' వంటి హిట్ ఇచ్చిన బోయపాటి శ్రీను ని తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలు పెట్టారనే న్యూస్ సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది.
అసలు 14 రీల్స్ నిర్మాతలు బోయపాటి - బాలకృష్ణ కలయికలో ఒక సినిమాని తెరకెక్కించాలని ఆలోచనలో ఉన్నారు. కానీ బాలకృష్ణ ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్స్ తో బోయపాటితో సినిమా చేసందుకు రెడీగా లేడు. అందుకే మహేష్ 27 వ సినిమాకి బోయపాటిని డైరెక్టర్ గా సెట్ చేసే పనిలో పడ్డారు 14 రీల్స్ నిర్మాతలు. ఇప్పటికే 14 రీల్స్ వారు బోయపాటితో చర్చలు జరుపుతున్నట్టుగా వార్తలొస్తున్నాయి. మరి నిజంగానే బోయపాటి మంచి లైన్ తో సినిమా కథ సిద్ధం చేసి మహేష్ ని ఒప్పిస్తే వారి కలయికలో రాబోయే ఆ సినిమా మామూలు మాస్ గా ఉంటుందో లేక ఊర మాస్ గా వుండబోతుందో అని మహేష్ అభిమానులు అప్పుడే కలలు కంటున్నారు.

